Maruti Suzuki | న్యూఢిల్లీ, అక్టోబర్ 29 : మారుతి సుజుకీ లాభాల స్పీడ్‌కు బ్రేక్‌పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,102 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది రూ.3,786 కోట్లతో పోలిస్తే 18 శాతం తగ్గింది. ఇండెక్సేషన్ ప్రయోజనాలను ఉపసంహరించుకోవడంతోపాటు డెట్ మ్యూచువల్ ఫండ్లపై దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను రేట్లలో మార్పుల కారణంగా లాభాలపై ప్రతికూల ప్రభావం చూపాయని కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ వెల్లడించారు. రూ.10 లక్షల లోపు ధర కలిగిన వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తున్నదని, దేశీయ వాహన విక్రయాల్లో 80 శాతానికిపైగా వాటా వీటిదేనన్నారు. ఆదాయంలోనూ నిరాశే ఎదురైంది. ఏడాది క్రితం రూ.37,339 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం ఈసారికిరూ.37,449 కోట్లకే పెరిగింది.