మారుతి కార్లు మరింత ప్రియం.. రూ.30 వేల వరకు పెంచిన సంస్థ
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కొనుగోలుదారులకు గట్టి షాకిచ్చింది. వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కార్ల ధరలను రూ.30 వేల వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది.
న్యూఢిల్లీ, మే 21 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కొనుగోలుదారులకు గట్టి షాకిచ్చింది. వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కార్ల ధరలను రూ.30 వేల వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికం కావడంతోపాటు ప్రతికూల వ్యయాలు పెరుగడం వల్లనే ధరలు సవరించాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
గడిచిన కొన్ని నెలలుగా నిర్వహణ ఖర్చులు అధికమైనప్పటికీ పొదుపు చర్యలకు మొగ్గుచూపినట్టు, ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒత్తిళ్లు అధికం కావడంతో ధరలు సవరించాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం సంస్థ రూ.3.49 లక్షలు మొదలుకొని రూ.28.7 లక్షల లోపు ధర కలిగిన పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. గతేడాది జీఎస్టీ ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా వాహన ధరలను రూ.1.30 లక్షల వరకు తగ్గించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

