చిన్న కార్లకు మారుతి గుడ్‌బై?
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ..చిన్న కార్లకు గుడ్‌బై పలుకబోతున్నదా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. చిన్న కార్లకు బదులుగా కొనుగోలుదారులు కాంప్యాక్ట్ ఎస్యూవీ, అతిపెద్ద హ్యాచ్‌బ్యాక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పాలసీల కారణంగా చిన్న కార్లకు స్వస్తి పలుకాలనుకుంటున్నట్లు కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ ఇటీవల వ్యాఖ్యానించడం ఈ వార్తకు నిజం చేకూరుస్తున్నది.
న్యూఢిల్లీ, జూన్ 29: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ..చిన్న కార్లకు గుడ్‌బై పలుకబోతున్నదా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. చిన్న కార్లకు బదులుగా కొనుగోలుదారులు కాంప్యాక్ట్ ఎస్యూవీ, అతిపెద్ద హ్యాచ్‌బ్యాక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పాలసీల కారణంగా చిన్న కార్లకు స్వస్తి పలుకాలనుకుంటున్నట్లు కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ ఇటీవల వ్యాఖ్యానించడం ఈ వార్తకు నిజం చేకూరుస్తున్నది. అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని కార్లలో ఖచ్చితంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలన్న కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలతో చిన్న కార్ల ఉత్పత్తిని నిలిపివేయాలనుకుంటున్నట్లు భార్గవ అన్నారు.
తయారీతో నష్టమే..
చిన్న కార్లను ఉత్పత్తి చేయడంతో సంస్థకు ఎలాంటి లాభం లేదని భార్గవ వ్యాఖ్యానించారు. మరోవైపు, గడిచిన ఐదేండ్లుగా కంపెనీకి చెందిన చిన్న వాహనాలు ఆల్టో, ఎస్-ప్రెస్సో అమ్మకాలు భారీగా పడిపోయాయి. 2017-18లో మినీ సెగ్మెంట్(ఆల్టో, వ్యాగన్ఆర్) సంయుక్తంగా 4,27,183 యూనిట్లు అమ్ముడవగా..2021-22లో సగానికి సగం పడిపోయి 2,11,762 యూనిట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, దేశీయ ఆటోమొబైల్ రంగంలో కంపెనీ మార్కెట్ వాటా 50 శాతం నుంచి 42 శాతానికి తగ్గడం కూడా ఇందుకు కారణం. రూ.10 లక్షల లోపు కాంప్యాక్ట్ కారును కొనుగోలు చేయడానికి మధ్యతరగతి భారతీయులు ఆసక్తి చూపుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- alto
- India
- maruti suzuki
- Small Cars
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

