ఉత్పత్తిలో మారుతి రికార్డు
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి మరో రికార్డు సృష్టించింది. జూలై నెలలో రికార్డు స్థాయిలో 2,48,845 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. క్రితంఏడాది ఇదే నెలలో ఉత్పత్తి చేసినదాంతో పోలిస్తే 33 శాతం అధికం. జూలై 2025లో సంస్థ 1,87,073 యూనిట్ల వాహనాలను ప్రొడ్యూస్ చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 2 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి మరో రికార్డు సృష్టించింది. జూలై నెలలో రికార్డు స్థాయిలో 2,48,845 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. క్రితంఏడాది ఇదే నెలలో ఉత్పత్తి చేసినదాంతో పోలిస్తే 33 శాతం అధికం. జూలై 2025లో సంస్థ 1,87,073 యూనిట్ల వాహనాలను ప్రొడ్యూస్ చేసింది. ఈ సందర్భంగా మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ మాట్లాడుతూ..గత నెలలో 1.78 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయని, డీలర్లకు పంపిన స్టాక్స్ కేవలం 16 రోజుల్లోనే అమ్ముడవుతున్నాయన్నారు.
అయినప్పటికీ ప్రస్తుతం 1.6 లక్షల యూనిట్ల బుకింగ్లు ఉన్నాయని, వీటిని త్వరలో సరఫరా చేయనున్నట్టు చెప్పారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సరాసరి ఇన్వెంటరీ 30 రోజులు ఉండగా, అదే సంస్థ ఇన్వెంటరీ కేవలం 16 రోజులేనని పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహన విక్రయాల్లో దూసుకుపోతున్న సంస్థ..గత నెలలో 1,96,203 యూనిట్ల పీవీలను దేశీయంగా విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇది 1,37,776 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే లైట్ కమర్షియల్ వాహనాలను 2 లక్షల యూనిట్లను విక్రయించగా, లక్ష యూనిట్ల యుటిలిటీ వాహనాలు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

