యూబీఐతో మారుతి జట్టు
ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్‌తో మారుతి సుజుకీ జతకట్టింది. కంపెనీకి చెందిన డీలర్లకు ఆర్థిక సహా యం అందించడానికి ఒప్పం దం కుదుర్చుకున్నట్లు మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 4 వేల డీలర్లకు ఆర్థిక సహాయం లభించనున్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్‌తో మారుతి సుజుకీ జతకట్టింది. కంపెనీకి చెందిన డీలర్లకు ఆర్థిక సహా యం అందించడానికి ఒప్పం దం కుదుర్చుకున్నట్లు మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 4 వేల డీలర్లకు ఆర్థిక సహాయం లభించనున్నది.
2008 నుంచి యూనియన్ బ్యాంక్‌తో కలిసి పనిచేస్తున్నట్లు, ఇప్పటి వరకు 3 లక్షల కార్లకు రుణాన్ని అందించిందన్నారు. ఈ సందర్భంగా యూబీఐ ఎండీ, సీఈవో ఏ మణిమేఖలాయ్ మాట్లాడుతూ.. కస్టమర్లకు సులభంగా రుణాన్ని అందించాలనే ఉద్దేశంతో మారుతితో జట్టుకట్టినట్టు, ఇప్పటి వరకు లక్షలాది కార్లకు రుణాన్ని మంజూరు చేసినట్లు చెప్పారు.
భవిష్యత్ భారత్‌దే: మారుతి చైర్మన్
మరే దేశంలోనూ లేనంత స్థాయిలో భవిష్యత్ వృద్ధి అవకాశాలు భారత్‌లో ఉన్నాయని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. ఆయన ఒక సదస్సులో మాట్లాడుతూ పశ్చిమ దేశాల్లో వృద్ధి డైలమాలో పడిందని, అక్కడి ప్రజలు పని విలువల్ని వదిలేశారని, పనిచేయకుండానే విలాస జీవితం కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
మరోవైపు భారత్‌లో ప్రజలు వారి సొంత భవిష్యత్ కోసమే కాకుండా, వారి కుటుంబాలు, పిల్లల కోసం వృద్ధిని ఆకాంక్షిస్తున్నారని భార్గవ చెప్పారు. అటువంటి ఆకలే భారత్‌ను ముందుకు నడిపిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో దేశం ముందుకెళ్లడానికి వివిధ బూజుపట్టిన చట్టాలు, నిబంధనల్ని వదిలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తమ ఉత్పాదక సామర్థ్యాన్ని ఒక లక్ష కార్ల నుంచి 22 లక్షలకు కార్లకు పెంచుకున్నామని, ఈ వృద్ధి అంతా అంతర్గత వనరుల ద్వారానే సాధించామని, దీనిని ఎటువంటి రుణ సదుపాయం పొందకుండానే 40 లక్షలకు పెంచుకుంటామన్నారు. తమ వద్ద రూ. 50,000 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

