న్యూఢిల్లీ, జూలై 22: మల్టీ పర్పస్ వాహనమైన ఎర్టిగా ధరను రూ.6 వేలు పెంచినట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ ప్రొగ్రాం(ఈఎస్పీ), హిల్ హోల్డ్ అసిస్ట్‌తో ఈ వాహనాన్ని రూపొందించినట్లు తెలిపింది. ఈ సరికొత్త ఫీచర్స్ కేవలం ఆటోమేటిక్, టాప్-ఎండ్ మాన్యువల్ ట్రిమ్ కలిగిన మోడల్లో మాత్రమే ఉంటుందని తెలిపింది. ఈ సరికొత్త ఫీచర్ల కోసం ఎర్టిగా ధరను రూ.6 వేలు పెంచినట్లు సంస్థ వెల్లడించింది. దీంతో ఢిల్లీ షోరూంలో ఈ కారు రూ.8.41 లక్షల ప్రారంభ ధరలో లభించనున్నది.