న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : ఇప్పటికే పలు మాడళ్ల ధరలను పెంచిన కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి .. తాజాగా మరో మాడల్ ధరను సవరించింది. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ మాడల్ బాలెనో ధరను రూ.9 వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత బాలెనో రూ.6.70 లక్షలు మొదలుకొని రూ.9.92 లక్షల లోపు ధరతో ఈ మాడల్ లభిస్తున్నది. దీంట్లో పెట్రోల్ మాడల్ 22.35 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుండగా, సీఎన్జీ కిలోకు 30.61 కిలోమీటర్లు ఇవ్వనున్నది. డెల్టా ఏజీఎస్, జెటా ఏజీఎస్, ఆల్ఫా ఏజీఎస్ రకం రూ.9 వేల వరకు పెరగనుండగా, ఇతర మాడళ్లు రూ.4 వేలు అధికంకానున్నది. టాటా అల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20లకు పోటీగా సంస్థ ఈ మాడల్‌ను ప్రవేశపెట్టింది.