న్యూఢిల్లీ, మార్చి 8: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..దేశీయ మార్కెట్లోకి కాంప్యాక్ట్ సెడాన్ డిజైర్‌ని ఎస్-సీఎన్జీ టెక్నాలజీతో తయారుచేసి ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ ధర రూ.8.14 లక్షలుకాగా, గరిష్ఠ ధర రూ.8.82 లక్షలు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, డీజైర్ ఎస్-సీఎన్జీ కలిగిన ఈ మోడల్ 31.12 కిలోమీటర్లు/కేజీ మైలేజీ ఇవ్వనున్నది. దేశీయంగా సీఎన్జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నూతన వెర్షన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.