న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..వ్యాగన్ఆర్ వాల్ట్ ఎడిషన్‌గా విడుదలచేసింది. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.5,65,671గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ మాడల్‌ను నూతన టెక్నాలజీతో ఆధునీకరించినట్లు, ముఖ్యంగా లోపలిభాగంలో పలు మార్పులు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఫాగ్ ల్యాంప్స్‌తోపాటు వీల్ ఆర్చ్ క్లాడింగ్స్, బంపర్ గార్డ్స్, బాడీ సైడ్ మౌల్డింగ్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్పీకర్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఉన్నాయి. దేశీయ రోడ్లపై 32.5 లక్షల వ్యాగన్ ఆర్ కార్లు దూసుకుపోతున్నాయి. పెట్రోల్‌తోపాటు సీఎన్జీ వెర్షన్లో కూడా లభించనున్నది.