Maruti Fronx | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. త్వరలో మార్కెట్లోకి ఫ్రాంక్స్ కారు తీసుకు రానున్నది. ఎస్యూవీ సెగ్మెంట్లో మార్కెట్ వాటా పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అత్యంత పోటీతత్వం గల సబ్-4 మీటర్స్ ఎస్యూవీ సెగ్మెంట్లో హ్యుండాయ్ వెన్యూ, కియా సొనెట్, టాటా నెక్సాన్ వంటి ఎస్యూవీ వేరియంట్ కార్లతో గట్టి పోటీ ఇవ్వడానికి మారుతి సుజుకి ఫ్రాంక్స్ సిద్ధమైంది.
మారుతి ఫ్రాంక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కార్లు 1.0 లీటర్ల టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజిన్ (100.06 పీఎస్/147.6 ఎన్ఎం), 1.2 లీటర్ల డ్యుయల్ జెట్ డ్యుయల్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ (89.73పీఎస్/113ఎన్ఎం) సామర్థ్యం కలిగి ఉంటాయి. 1.0 లీటర్ల ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 1.2 లీటర్ల ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వస్తున్నది.
మారుతి ఫ్రాంక్స్ కారు 1.0 ఎంటీ ఇంజిన్‌పై లీటర్ పెట్రోల్ 21.5 కి.మీ, 1.0 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇంజిన్‌పై 20 లీటర్ల మైలేజీ ఇస్తుంది. 1.2 ఎంటీ ఇంజిన్ కారు లీటర్‌కు 21.79 కి.మీ, 1.2 ఏఎంటీ ఇంజిన్ 22.89 కి.మీ మైలేజీ ఇస్తుంది. వీటి ధరలు రూ.6.75 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్య పలుకుతాయి.
ఎల్ఈడీ మల్టీ రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఎల్ ఈడీ రేర్ కాంబినేషన లాంప్స్, షార్క్ ఫిన్ ఆంటీనా, 9-అంగుళాల హెచ్డీ స్మార్ట్ ప్లే ప్రో + ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆర్కామైస సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ ైక్లెమేట్ కంట్రోల్, హెడ్ అప్ డిస్ప్లే విత్ బై-టర్న్ నావిగేసన్, 360-డిగ్రీల వ్యూ కెమెరా, వైర్ లెస్ చార్జర్, సుజుకి కనెక్ట్ విత్ 40కి పైగా కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
ఆరు ఎయిర్‌బ్యాగులు, 3-పాయింట్ ఈఎల్ఆర్ సీట్‌బెల్టులు, ఈఎస్పీ విత్ హిల్ హోల్డ్ అసిస్ట్, రోల్ ఓవర్ మిటిగేసన్, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఐసోఫిక్స్, చైల్డ్ సీట్ మౌంట్స్ తదితర సేఫ్టీ ఫీచర్లు కూడా జత కలిశాయి.