Maruti Suzuki Fronx | గ్రాండ్ విటారాను దాటేసిన ఫ్రాంక్స్.. కేవలం పది నెలల్లో..!
Maruti Suzuki Fronx | మారుతి సుజుకి ఫ్రాంక్స్ మార్కెట్లోకి వచ్చిన 10 నెలల్లోనే లక్ష కార్ల విక్రయ మార్కును దాటేసింది. అంతకుముందు గ్రాండ్ విటారా 12 నెలల్లో నమోదు చేసిన రికార్డును బ్రేక్ చేసింది.
Maruti Suzuki Fronx | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియస్‌గా, హాయిగా ప్రయాణం చేయడానికి వీలుగా ఉండే ఎస్యూవీ కార్లకు దేశీయ మార్కెట్లో గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో కార్ల తయారీ కంపెనీలు ఎస్‌యూవీల తయారీపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ఆ జాబితాలో మారుతి సుజుకి మొదటి వరుసలో నిలుస్తుంది. గతేడాది ఏప్రిల్‌లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన మారుతి సుజుకి సబ్-4 మీటర్ కంపాక్ట్ ఎస్యూవీ కారు ఫ్రాంక్స్ కొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 10 నెలల్లోనే లక్ష యూనిట్లు విక్రయించిన సంస్థగా నిలిచింది. అంతకుముందు 12 నెలల్లో లక్ష యూనిట్లు విక్రయించిన మారుతి గ్రాండ్ విటారా రికార్డును కూడా బ్రేక్ చేసింది.
మారుతి ఫ్రాంక్స్ 1.2- లీటర్ల డ్యుయల్ జెట్ డ్యుయల్ వీవీటీ పెట్రోల్ (89.73 పీఎస్ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్), 1.0 లీటర్ల టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ (100.06 పీఎస్ విద్యుత్, 147.6 ఎన్ఎం టార్క్) ఇంజిన్లతో వస్తున్నది. 1.2 లీటర్ల యూనిట్ 5-స్పీడ్ ఎంటీ, 5-స్పీడ్ ఏఎంటీ, 1.0 లీటర్ల యూనిట్ 5-స్పీడ్ ఎంటీ/ 6-స్పీడ్ ఏటీ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ వర్షన్ 1.2 లీటర్ల డ్యుయల్ జెట్ డ్యుయల్ వీవీటీ పెట్రోల్ (77.5 పీఎస్ 98.5 ఎన్ఎం టార్క్) విత్ 5-స్పీడ్ ఎంటీ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఫ్రాంక్స్ కార్ల మొత్తం సేల్స్ లో ఆటోమేటిక్ వర్షన్ సేల్స్ 24 శాతం. ఈ కార్ల ధరలు రూ.7.46 లక్షల నుంచి రూ.13.13 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నాయి.
2022లో ఎస్‌యూవీల విక్రయాలు 10.4 శాతం ఉంటే, గతేడాది 19.7 శాతానికి పెరిగిందని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. దీనికి కారణం మారుతి ఫ్రాంక్స్ అని పేర్కొన్నారు. ఏడాదిలోనే ఎస్యూవీ సేల్స్ రెట్టింపుకు పైగా నమోదు అయ్యాయని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

