Maruti Suzuki Ertiga | మారుతి సుజుకి దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ.. అంతే కాదు కార్ల ప్రియులను ఆకట్టుకోవడంలో ముందు వరుసలో నిలుస్తుంది. ప్రతి నెలా వేల కార్లు అమ్ముడవుతాయి. మారుతి కారు బుక్ చేసుకుంటే దాన్ని ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాలంటే నెలల తరబడి వెయిటింగ్ చేయాల్సిందే. దీన్ని బట్టి మారుతి కార్లకు గిరాకీ ఎంత ఉంటుందో అర్థమవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా కార్ల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిల్లో ఎర్టిగా ఎంవీపీ (Ertiga MP) కుటుంబంలో ఏడుగురు సభ్యులు హాయిగా ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఆ ఎర్టిగా మోడల్ కార్ల ఆర్డర్లు అత్యధికంగా పెండింగ్లో ఉన్నాయని తెలుస్తున్నది.
లక్షకు పైగా ఎర్టిగా ఎంవీపీ (Ertiga MP) కార్ల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. పెట్రోల్ అండ్ సీఎన్జీ వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఎర్టిగా ఎంవీపీ పెండింగ్ ఆర్డర్లలో 56 శాతం అంటే 68 వేల యూనిట్ల కార్ల ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నాయి. తర్వాతీ జాబితాలో గతేడాది మార్కెట్లోకి ఎంటరైన ‘న్యూ మారుతి బ్రెజా (Maruti Brezza)` బుకింగ్స్ సుమారు 60 వేలు పెండింగ్.
ఈ నెలలో ఐదు డోర్ల మారుతి సుజుకి జిమ్నీ (Maruti Suzuki Jimny) మార్కెట్లోకి రాబోతున్నది. ఫ్రాన్స్ స్మాల్ ఎస్యూవీ, ఫ్రాన్స్ లైఫ్ స్టైల్ ఆఫ్ -రోడ్ ఎస్యూవీ కార్ల ఆర్డర్లు 30 వేలకు పైగా పెండింగ్లో ఉన్నాయని సమాచారం.
అంతే కాదు మారుతి సుజుకి తన ఎస్-ప్రెస్సో, బ్రెజా, గ్రాండ్ విటారా, స్విప్ట్, డిజైర్, బాలెనో, ఎక్స్16 మోడల్ కార్లలో సీఎన్జీ వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చింది. దేశంలోనే అత్యధికంగా 12 మోడల్ కార్లను సీఎన్జీ ఆప్షన్లలో యూజర్లకు అందుబాటులో తెచ్చిన కారుగా మారుతి సుజుకి నిలిచింది.
ఇంజిన్ : 1462 సీసీ
బీహెచ్పీ : 86.63 – 101.65 బీహెచ్పీ
ట్రాన్స్మిషన్ : ఆటోమేటిక్ / మాన్యువల్
మైలేజ్ : 20.51 కేఎంపీఎల్ – 26.11 కి.మీ ఫర్ కేజీ
ప్యూయల్ : పెట్రోల్ / సీఎన్జీ
6-స్పీడ్ టార్చ్ కన్వర్ట్ ట్రాన్స్మిషన్ లేదా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. రెండు ఆప్షన్లలోనూ ఎర్టిగా 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ విత్ మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ (103పీఎస్ విద్యుత్/ 137ఎన్ఎం టార్చి) కెపాసిటీతో వస్తుంది. సీఎన్జీ పవర్ ట్రెయిన్ 88 పీఎస్, 121.5 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
భారత్ మార్కెట్లో ఎర్టిగా ఎంవీపీ కారు ధర రూ.8.64 లక్షల నుంచి రూ.14.42 లక్షల మధ్య పలుకుతుంది. తొమ్మిది వేరియంట్లలో మారుతి ఎర్టిగా లభిస్తుంది. వీటికి ఇన్సూరెన్స్, ఆర్టీఓ, రిజిస్ట్రేషన్ చార్జీలు అదనం.
హైదరాబాద్లో మారుతి ఎర్టిగా బేస్ వేరియంట్ ధర రూ.8.64 లక్షలు. ఆర్టీవో చార్జీలు రూ.1.20,960, ఇన్సూరెన్స్ రూ.35,819, ఇతరాలు ప్లస్ ఆప్షనల్స్ విడిభాగాలు కలుపుకుని రూ.29,013.. మొత్తం సుమారుగా రూ.10,21,279 పలుకుతుందని తెలుస్తున్నది. అత్యధికంగా అమ్ముడవుతున్న వీఎక్స్ఐ (ఓ) పెట్రోల్ వేరియంట్ ధర రూ.11.54 లక్షలకు లభిస్తుందని సమాచారం. యూజ్డ్ మారుతి ఎర్టిగా రూ.5.70 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.
జడ్ఎక్స్ఐ (ఓ) పెట్రోల్ : రూ.13.26 లక్షలు.
వీఎక్స్ఐ ఏటీ (పెట్రోల్): రూ.13.74 లక్షలు.
జడ్ఎక్స్ఐ ప్లస్ (పెట్రోల్) : రూ.14.10 లక్షలు.
జడ్ఎక్స్ఐ ఏటీ (పెట్రోల్): రూ.15.07 లక్షలు.
జడ్ఎక్స్ఐ ప్లస్ (ఏటీ) పెట్రోల్ (టాప్ మోడల్): రూ.15.91 లక్షలు.
వీఎక్స్ఐ (ఓ) సీఎన్జీ (బేస్ మోడల్): రూ.13.09 లక్షలు.
జడ్ఎక్స్ఐ (ఓ) సీఎన్జీ (టాప్ మోడల్: రూ.14.42 లక్షలు.