Maruti Suzuki Dzire | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఫోర్త్ జనరేషన్ సెడాన్ `డిజైర్` సోమవారం ఆవిష్కరించింది. కంపాక్ట్ సెడాన్ క్యాటగిరీలో హాట్ కేక్ లా అమ్ముడు పోతోందీ డిజైర్. ఈ నేపథ్యంలో డిజైర్ ఫీచర్లు మరింత డెవలప్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది మారుతి సుజుకి. భారతీయ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా డిజైన్, సేఫ్టీ, టెక్నాలజీ, పవర్ ట్రైన్, కంఫర్ట్, సేఫ్టీ, స్టైల్‌గా రూపుదిద్దుకున్నదీ డిజైర్. ఈ కారు ధర సుమారు. 6.79 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. రూ.11 వేలు చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చునని గత వారమే మారుతి సుజుకి తెలిపింది. గ్లోబల్ ఎన్-క్యాప్ క్రాష్ టెస్ట్‌ల్లో 5-స్టార్ రేటింగ్ అడల్ట్ , చైల్డ్ ఆక్యుపెంట్ సేఫ్టీలో 4-స్టార్ రేటింగ్ కలిగి ఉంటుందీ కారు. మారుతి సుజుకి కార్లలో ఈ రేటింగ్ పొందిన తొలి కారు ఇది. హోండా అమేజ్, హ్యుండాయ్ ఔరా, టాటా టైగోర్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. సెడాన్ కార్ల సెగ్మెంట్లో 50 శాతం వాటా కలిగి ఉంటుందీ డిజైర్.
అర్బన్ డ్రైవింగ్ సూటబుల్ గా ఉంటుందీ మారుతి డిజైర్. గ్లాస్ బ్లాక్ ట్రిమ్, ప్రీమియం టచ్‌తో క్రోమ్ ఫినిష్డ్ బాటం లైన్, డ్యుయల్ టోన్ డాష్ బోర్డు విత్ స్పేసియస్ లే ఔట్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు మద్దతుగా 9- అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తోపాటు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉంటుంది. సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, రేర్ ఏసీ వెంట్స్, రేర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, 360- డిగ్రీ కెమెరా ఫర్ ఎన్హాన్స్ డ్ విజిబిలిటీ అండ్ సేఫ్టీ తదితర ఫీచర్లు ఉంటాయి.
సేఫ్టీ కోసం మారుతి సుజుకి డిజైర్ కారులో సమగ్ర రక్షణ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), హిల్ హోల్డ్ అసిస్ట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూసన్ (ఈబీడీ), అన్ని సీట్లకూ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్స్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ ఉంటాయి. న్యూ డిజైర్ కారు తాజా మారుతి జడ్- సిరీస్ 1.2 లీటర్ల 3- సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. గరిష్టగా 82 హెచ్‌పీ విద్యుత్, 112 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తుంది. న్యూ డిజైర్ కారుపై సబ్ స్క్రిప్షన్ మోడల్ కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ.18,248 చొప్పున చెల్లించి సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలి. ఇందులో కారు ధర, రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ తదితర ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
డిసెంబర్ నెలాఖరు వరకూ మారుతి సుజుకి న్యూ డిజైర్ కార్ల ఇంట్రడ్యూసరీ ధరలు అందుబాటులో ఉన్నాయి. వేరియంట్ల వారీగా..:
పెట్రోల్ వేరియంట్ (ఎక్స్ షోరూమ్ ధరలు)
ఎల్ఎక్స్ఐ మాన్యువల్ : రూ.6,79,000
వీఎక్స్ఐ మాన్యువల్ : రూ.7,79,000
జడ్ఎక్స్ఐ మాన్యువల్ : రూ.8,89,000
జడ్ఎక్స్ఐ+ మాన్యువల్: రూ.9,69,000
వీఎక్స్ ఏజీఎస్ (ఆటో గేర్ షిఫ్ట్): రూ.8,24,000
జడ్ఎక్స్ఐ ఏజీఎస్: రూ.9,34,000
జడ్ఎక్స్ఐ + ఏజీఎస్ : రూ.10,14,000
సీఎన్జీ వేరియంట్స్ (ఎక్స్ షోరూమ్ ధరలు)
ఎల్ఎక్స్ఐ మాన్యువల్ : రూ.8,24,000
వీఎక్స్ఐ మాన్యువల్ : రూ.8,74,000
జడ్ఎక్స్ఐ మాన్యువల్ : రూ.9,84,000