Baleno Regal | న్యూఢిల్లీ, అక్టోబర్ 15: దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీ..ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని నూతన ఫీచర్లతో రూపొందించిన బాలెనోను మార్కెట్‌కు పరిచయం చేసింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఇప్పటికే కీలకపాత్ర పోషిస్తున్న బాలెనోను లిమిటెడ్ ఎడిషన్‌గా అందుబాటులోకి తీసుకొచ్చింది.
రెండు రకాల్లో లభించనున్న ఈ కారు రూ.6.66 లక్షల నుంచి రూ.9.83 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో నూతన గ్రిల్ అప్పర్ గార్నిష్, ఫాగ్ ల్యాంప్, నూతన సీట్ కవర్లు, తొమ్మిది ఇంచుల స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి 40 అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫీచర్స్‌తో తయారు చేసింది.