న్యూఢిల్లీ, జూలై 16: మారుతి సుజుకీ..ఎర్టిగా, బాలెనో వాహన ధరలను 1.4 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ రెండు మాడళ్లలో భద్రత ప్రమాణాలను మెరుగుపర్చడంలో భాగంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను నెలకొల్పింది. దీంతో వీటి ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో రూ.6.7 లక్షల నుంచి రూ.9.92 లక్షల లోపు, ఎర్టిగా రూ.8.97 లక్షల నుంచి రూ.13.25 లక్షల లోపు లభించనున్నాయి.