Maruti Suzuki Tour H1 | మారుతి సుజకి తన అత్యాధునిక ఆల్టో కే10 (Alto K10) టెక్నాలజీ ఆధారంగా రూపుదిద్దుకున్న కమర్షియల్ హ్యాచ్‌బ్యాక్ కారు ‘టూర్ హెచ్1’ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ హ్యాచ్ బ్యాక్ కారు- మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్రానైట్ గ్రే, ఆర్కిటిక్ వైట్ రంగుల్లో లభిస్తుంది. ఈ కారు ధర రూ.4.80 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
నెక్ట్స్ జనరేషన్ కే-సిరీస్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న టూర్ హెచ్1 (Tour H1) కారు 1.0-లీటర్ల డ్యుయల్ జెట్, డ్యుయల్ వీవీటీ ఇంజిన్ కలిగి ఉంటుంది. డ్యుయల్ జెట్, డ్యుయల్ వీవీటీ ఇంజిన్ పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 66.6 పీఎస్ విద్యుత్, 89 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సీఎన్జీ వేరియంట్ 56.6 పీఎస్ విద్యుత్, 82.1 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రూపుదిద్దుకున్నది. పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ లీటర్ పెట్రోల్ మీద 24.60 కి.మీ, సీఎన్జీ వేరియంట్ కిలో సీఎన్జీపై 34.46 కి.మీ మైలేజీ ఇస్తుంది.
డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్స్ విత్ ప్రీ-టెన్షనర్ అండ ఫోర్స్ లిమిటర్, ముందూ వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు సీట్ బెల్ట్ రిమైండర్స్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్పీడ్ లిమిటింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు తదితర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
టూర్ హెచ్1 పెట్రోల్ – రూ.4.80 లక్షలు.
టూర్ హెచ్1 సీఎన్జీ – రూ.5.70 లక్షలు.