Maruti Invicto | మారుతి సుజుకి తన ఫ్లాగ్షిప్.. మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ఇన్విక్టో్ (Invicto) ను దేశీయ మార్కె్ట్లో ఆవిష్కరించింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ ఆధారిత టెక్నాలజీతో రూపుదిద్దుకున్న మారుతి ఇన్విక్టో ధర రూ.24.79 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. జెటా + (7 సీటర్), జెటా + (8 సీటర్), ఆల్ఫా + (7 సీటర్) వేరియంట్లలో లభిస్తుంది. టాప్ వేరియంట్ కారు ధర రూ.28.42 లక్షలు పలుకుతున్నది. మిడిల్ వేరియంట్ కారు రూ.24.84 లక్షలకు లభిస్తుంది. నెలవారీగా రూ.61,860లపై సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ కూడా ఇచ్చింది మారుతి సుజుకి.
గతేడాది వరకు రూ.15-20 లక్షల మధ్య కార్ల మార్కెట్‌పై పట్టు కలిగి ఉన్న మారుతి సుజుకి తాజాగా రూ.20 లక్షల పై చిలుకు ధర గల మార్కెట్ కైవసం చేసుకోవాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నది. జూన్ నుంచి ఇప్టపి వరకు ఇన్ విక్టో కోసం 6,200 బుకింగ్స్ నమోదయ్యాయి.
నెక్సా బ్లూ, మ్యాస్టిక్ వైట్తోపాటు నాలుగు రంగుల్లో మారుతి సుజుకి ఇన్విక్టో లభిస్తుంది. ఈ కారును నెక్సా ప్రీమియం రిటైల్ నెట్ వర్క్ షోరూమ్ ల్లో ఏర్పాటు చేశారు.
ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రీడ్ సిస్టమ్ గల ఈ కారు ఇంజిన్ 2.0 లీటర్ల ఇంజిన్ విత్ ఈ-సీవీటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో వస్తుంది. డ్యుయల్ పవర్ ట్రైన్ సిస్టమ్ తో కూడిన ఇంజిన్ ఇది. ఎలక్ట్రిక్ మోటార్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఇంజిన్ లీటర్ పెట్రోల్ మీద 23.24 లీటర్ల మైలేజీ ఇస్తుంది.
హైబ్రీడ్ మోటార్‌తో కూడిన 2.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నది. పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 172బీహెచ్పీ విద్యుత్, 188 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ-సీవీటీ యూనిట్ ట్రాన్స్ మిషన్ ఆఫ్షన్ కూడా ఉంది.