రూ.30 వేల వరకు పెరుగనున్న మారుతి కార్లు
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరోసారి ధరలను పెంచేసింది. ఆగస్టు నెల నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను రూ.30 వేల వరకు సవరిస్తున్నట్టు ప్రకటించింది.
న్యూఢిల్లీ, జూలై 21: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరోసారి ధరలను పెంచేసింది. ఆగస్టు నెల నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను రూ.30 వేల వరకు సవరిస్తున్నట్టు ప్రకటించింది. నిరంతరంగా ఉత్పత్తి వ్యయం పెరుగడంతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా కొనుగోలుదారులపై భారం మోపాల్సి వచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పెరుగనున్న ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. గత కొన్ని నెలలుగా ధరలను తగ్గించాలని చూస్తున్నప్పటికీ మరోవైపు ముడి సరుకుల ధరలు, ఉత్పత్తి వ్యయం పెరుగడంతోపాటు ద్రవ్యోల్బణం కారణంగా తప్పనిపరిస్థితుల్లో ధరలను సవరించాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం సంస్థ రూ.3.5 లక్షలు మొదలుకొని రూ.28.70 లక్షల లోపు ధర కలిగిన పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

