హైదరాబాద్, అక్టోబర్ 27: మారుట్ డ్రోన్..హైదరాబాద్లో నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం నుంచి ఉత్పత్తి, టెక్నాలజీ, రీసర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్అండ్డీ) సంబంధించిన అన్ని రకాల సేవలు అందించనున్నట్టు కంపెనీ సీఈవో, ఫౌండర్ ప్రేమ్ కుమార్ తెలిపారు.
దేశీయంగా పది రాష్ర్టాల్లో 100 డీలర్లు ఉండగా..2028 నాటికి ఈ సంఖ్యను 500కి పెంచుకోనున్నట్లు ప్రకటించింది. అలాగే ఉద్యోగుల సంఖ్యను 80 నుంచి 200కి పెంచుకోనున్నట్టు ప్రకటించింది. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో సర్వీస్ సెంటర్ను సైతం నెలకొల్పనున్నట్టు ఆయన ప్రకటించారు.