Gold Smuggling | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద బంగారం స్మగ్లింగ్ చేస్తున్న దంపతులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారు అక్రమంగా తరలిస్తున్న బంగారం విలువ రూ.1.41 కోట్లు ఉంటుందని తెలుస్తున్నది. బహ్రెయిన్ నుంచి ఆదివారం వారిద్దరు విమానంలో వచ్చారని కస్టమ్స్ అధికారులు చెప్పారు. ట్రాలీ బ్యాగ్ లైనింగ్ లోపల 1.5కిలోల బంగారాన్ని దాచి పెట్టారని, దాని విలువ రూ.1.11 కోట్లు ఉంటుందని తెలిపారు.
పురుషుడి వద్ద గల బ్యాగ్లో 15 సిల్వర్ కలర్డ్ మెటల్ వైర్లలో బంగారం, మహిళా ప్రయాణికురాలి ట్రాలీ బ్యాగ్లో నాలుగురు సిల్వర్ కలర్డ్ వైర్లలో బంగారం దొరికిందన్నారు. తాము బహ్రెయిన్ నుంచి వచ్చినట్లు విచారణలో దంపతులు తెలిపారు. మొత్తం 1.9 కిలోల బంగారం విలువ రూ.1.41 కోట్లు ఉంటుందన్నారు. మొత్తం బంగారాన్ని జప్తు చేసుకున్నట్లు, అక్రమంగా బంగారం తరలిస్తున్న భార్యాభర్తలను అరెస్ట్ చేశామని కస్టమ్స్ అధికారులు వివరించారు.