Stocks | నష్టాల్లోకి సూచీలు.. లాభాల స్వీకరణకు మదుపర్లు మొగ్గు..!
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆరు రోజుల వరుస లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. తొలుత శుభారంభాన్ని అందుకున్నా, మధ్యాహ్నం ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో ఇండెక్సులు నష్టాలతో ముగిశాయి.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆరు రోజుల వరుస లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల్లో ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో బేరిష్ ధోరణి కనిపించింది. ఇటీవల విదేశీ పెట్టుబడుల రాకతో ఇండెక్స్ మేజర్లు భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ స్టాక్స్ నష్టాలను పరిమితం చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 269.03 పాయింట్ల నస్టంతో 77,209.90 పాయింట్ల నష్టంతో ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా ఇంట్రాడే ట్రేడింగ్‌లో రికార్డు స్థాయి గరిష్టం 23,667.10 పాయింట్లకు దూసుకెళ్లింది. కానీ అద్యంతం అదే దూకుడును కొనసాగించలేకపోయింది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి 65.90 పాయింట్ల పతనంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,501.10 పాయింట్ల వద్ద స్థిర పడింది. వారం రోజుల ట్రేడింగ్ లో బీఎస్ఈ సెన్సెక్స్ 217.13 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 25.5 పాయింట్లు లాభ పడ్డాయి.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌లో ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, నెస్లే, టాటా స్టీల్, హిందూస్థాన్ యూనీ లివర్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్ భారీగా నష్టపోయాయి. మరోవైపు భారతీ ఎయిర్ టెల్, ఇన్పోసిస్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, ఎన్టీపీసీ భారీగా లబ్ధి పొందాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.26 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ 0.06 శాతం పుంజుకున్నాయి. సెక్టోరల్ ఇండెక్సుల్లో ఆయిల్ అండ్ గ్యాస్ 1.28 శాతం, ఎఫ్ఎంసీజీ 1.08, క్యాపిటల్ గూడ్స్ 0.71, కమోడిటీస్ 0.92, రియాల్టీ 0.75, ఆటో 0.71 శాతం నష్టపోయాయి. మరోవైపు ఐటీ, టెలికం, మెటల్, పవర్, టెక్నాలజీ, సర్వీసెస్ సెక్టార్లు లాభ పడ్డాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- BES Sensex
- Business news
- l&t
- stocks
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

