ముంబై, ఏప్రిల్ 30: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. తీవ్ర ఊగిసలాటలో కొనసాగిన సూచీలకు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం, బజాజ్ షేర్లలో భారీగా అమ్మకాలు జరగడం సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులు కుమ్మరించినప్పటికీ సూచీలు నష్టపోవడం విశేషం. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 46.14 పాయింట్లు కోల్పోయి 80,242.24 వద్ద ముగియగా, మరో సూచీ నిఫ్టీ 1.75 పాయింట్లు తగ్గి 24,334.20 వద్ద ముగిసింది.
టాటా మోటర్స్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోగా..మారుతి, భారతీ ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మహారాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం స్టాక్ మార్కెట్లు సెలవుపాటించనున్నాయి.