Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి. మార్కెట్ బుల్ పరుగులు తీస్తుంటే సెన్సెక్స్‌లో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,03,010.73 లక్షలు పెంచుకున్నాయి. వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీగా లాభ పడ్డాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ గతవారం 780.45 పాయింట్లు (1.19 శాతం) లాభ పడింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 66,060.90 పాయింట్ల వద్ద ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.
టాప్-10 స్క్రిప్ట్‌ల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.69,990.57 కోట్లు పెరిగి రూ.18,53,033.73 కోట్లకు చేరుకున్నది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.68,168.12 కోట్లు పుంజుకుని రూ.12,85,058.84 కోట్ల వద్ద స్థిరపడింది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.39,094.81 కోట్లు లాభపడి రూ.5,91,547.67 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.10,272.84 కోట్ల లబ్ధితో రూ.4,95,116.94 కోట్ల వద్ద నిలిచింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,135.42 కోట్లు పెరిగి రూ.6,72,837.72 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.5348.97 కోట్ల లబ్ధితో రూ.5,87,951.43 కోట్ల వద్ద ముగిసింది.
మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,695.25 కోట్లు నష్టంతో రూ.9,19,962.74 కోట్ల తో సరిపెట్టుకుది.ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.8999 కోట్ల నష్టంతో రూ.5,21,598.40 కోట్ల వద్ద స్థిర పడింది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ 8,130.77 కోట్లు కోల్పోయి రూ.4,53,280.03 కోట్ల వద్ద స్థిర పడింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) రూ.4,581.7 కోట్లు కోల్పోయి రూ..6,28,950.34 కోట్లకు చేరుకున్నది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10లో రిలయన్స కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎస్బీఐ, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి.