Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. దేశీయ మార్కెట్లో మిశ్రమ ఫలితాల మధ్య మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 83,790.72 పాయింట్ల వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 83,935.01 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్.. అత్యల్పంగా 83,150.77 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. చివరకు 287.60 పాయింట్లు పతనమై.. 83,409.69 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 88.40 పాయింట్లు తగ్గి 25,453.40 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,716 షేర్లు లాభపడగా.. మరో 2,125 షేర్లు నష్టపోయాయి.
నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్అండ్టీ భారీగా నష్టపోయాయి. టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ముగిశాచి. రంగాలవారీగా చూస్తే.. మెటల్ ఇండెక్స్ 1.4 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఒకశాతం పెరిగాయి. పీఎస్‌యూ బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, రియాలిటీ, మీడియా, పవర్ 0.4 నుంచి 1.4 శాతం వరకు తగ్గాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక్కొక్కటి 0.2శాతం వరకు తగ్గాయి.