Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 77,554.83 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. అదే ఉత్సాహంతో కొనసాగింది. ఇంట్రాడేలో 77,100.36 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. అత్యధికంగా 77,643.09 పాయింట్ల గరిష్ఠానికి పెరిగింది. చివరకు 141.34 పాయింట్ల లాభంతో 77,478.93 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 51 పాయింట్లు పెరిగి 23,567 వద్ద ముగిసింది. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ టాప్ గెయినర్స్ నిలిచాయి. హీరో మోటోకార్ప్, సన్ ఫార్మా, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, విప్రో నష్టపోయాయి. ఆటో, ఫార్మా, పీఎస్‌యూ, బ్యాంక్ రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. మెటల్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్‌లో కొనుగోళ్లు కనిపించాయి.
బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరగగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం వృద్ధి చెందింది.