న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఉద్యాన పంటలను ప్రోత్సహించడంలో భాగం గా కేంద్రం తాజాగా ఐదు ప్రైవేట్ సంస్థలకు క్టస్టర్లు ఏర్పాటు చేయడానికి అనుమతినిచ్చింది. రూ.750 కోట్ల పెట్టుబడితో 50 వేల హెక్టార్లలో వీటిని నెలకొల్పడానికి దేశాయ్ అగ్రిఫుడ్స్, ఎఫ్ఐఎల్ ఇండస్ట్రీస్, సహ్యాద్రి ఫార్మ్స్, మేఘాలయ బేసిస్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, ప్రసాద్ సీడ్స్లు ముందుకొచ్చాయి. వీటిలో తెలంగాణలోని మహబూబ్నగర్లో ప్రసాద్ సీడ్స్ ఏర్పాటు చేయతలపెట్టిన మ్యాంగో క్లస్టర్ కూడా ఉన్నది.