ఖైరతాబాద్, ఆగస్టు 8 : శ్రావణమాసంలో వినియోగ దారుల కోసం మంగళగౌరి గ్రాండియర్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చింది. తెలుగువారి సంప్రదాయ ప్రకారం వివాహాది శుభాకార్యాలు, శుక్రవారపు నోములు, మంగళగౌరి వ్రతాలు వంటివి ఈ మాసంలోనే నిర్వహిస్తారు. శ్రావణమాసం వేడుకల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి గ్రాండియర్ తమ వినియోగదారుల కోసం ప్రారంభించిన కేజీ సేల్స్ ఆఫర్ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.
వైవిధ్యభరితమైన కంచి, ధర్మవరం, ఉప్పాడ, పోచంపల్లి, ఆరణి, గద్వాల, వెంకటగిరి, బనారస్ పట్టుచీరల కొనుగోలుకు వినియోగదారులు పోటీ పడుతున్నారు. అన్ని రకాల వస్ర్తాలపై 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుండటంతో నాణ్యమైన పట్టు వస్ర్తాల కొనుగోలు కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే వినియోగదారుల కోసం విశాలమైన పార్కింగ్, ఇతర వసతులు కల్పించారు.