హైదరాబాద్, నవంబర్ 22: ఫ్రాన్స్‌కు చెందిన సువాసన, రుచుల ఉత్పత్తుల తయారీ సంస్థ మానే..హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. కస్టమర్లకు అన్ని రకాల రుచులు అందించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఎండీ సుమిత్ దాస్‌గుప్తా తెలిపారు. 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి రూ.25 కోట్ల నిధులు వెచ్చించినట్లు చెప్పారు.