న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. భారత్లో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా 20 షోరూంలను ప్రారంభించబోతున్నది.
వీటిలో ఉత్తరప్రదేశ్లో మూడు, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్లలో రెండేసి చొప్పున..ఒడిశా, తెలంగాణ, బెంగాల్, పంజాబ్లలో ఒక్క షోరూంను ప్రారంభించాలనుకుంటున్నట్లు మలబార్ గ్రూపు చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. దీంతోపాటు షార్జా, ఖతార్, సౌదీ అరేబియా, ఉత్తర అమెరికాల్లో నూతన షోరూం లు అందుబాటులోకి తీసుకురానున్నది.