Mahindra Scorpio-N | దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాలో చౌక ధరలో అత్యంత పాపులర్ ఎస్యూవీ స్కార్పియో-ఎన్. కానీ, ఇప్పుడు కర్బన ఉద్గారాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత. కార్లు.. బైక్లు, స్కూటర్లు, ఆటోలు, భారీ వాహనాలు.. ఒక్కటేమిటి.. అన్ని రకాల వాహనాల తయారీలో కేంద్రం ఈ నెల ఒకటో తేదీ నుంచి రెండోదశ బీఎస్-6 ప్రమాణాలు అమలు చేయాలన్న నిబంధన తెచ్చింది. ఈ నిబంధన కింద ఎప్పటికప్పుడు వెహికల్ నుంచి వెలువడే ఉద్గారాలను లెక్క గట్టేందుకు ఇంజిన్లలో `రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ)` పరికరం తప్పనిసరిగా అమర్చాల్సి ఉంటుంది. ఇది కాసింత పిరం కూడా..అందుకే కార్ల తయారీ ఖర్చు పెరిగిపోతున్నది. దీంతో ఇతర కార్లతోపాటు స్కార్పియో-ఎన్ వేరియంట్ల ధరలన్నీ పెరిగిపోయాయి.
వివిధ వేరియంట్ల స్కార్పియో-ఎన్ కారు ధర తాజాగా రూ.31 వేల నుంచి రూ.56 వేలు పెరిగింది. స్కార్పియో-ఎన్ కారు పెట్రోల్ వేరియంట్ ధర రూ.13.05 లక్షల నుంచి రూ.21.56 లక్షల మధ్య పలుకుతున్నది. డీజిల్ వేరియంట్ స్కార్పియో-ఎన్ ధర రూ.13.55 లక్షల నుంచి రూ.24.51 లక్షల మధ్య పెరిగింది.
మహీంద్రా స్కార్పియో-ఎన్ కారులో 2.0 లీటర్ల ఎం-స్టాల్లియన్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, ఎం-హాక్ డీజిల్ ఇంజిన్ వేరియంట్ ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ 197 బీహెచ్పీల పవర్, గరిష్టంగా 380 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. డీజిల్ వేరియంట్ 173 బీహెచ్పీల పవర్, 400 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. స్కార్పియో-ఎన్ డీజిల్ వేరియంట్ కారు 4-వీల్ డ్రైవ్ (4డబ్ల్యూడీ) ఆప్షన్ కలిగి ఉంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కలిగి ఉంటుంది.
మహీంద్రా స్కార్పియో-ఎన్ కారులో 8-అంగుళాల టచ్స్క్రీన్తోపాటు సోనీ 12 స్పీకర్ ఆడియో సిస్టమ్ విత్ 3డీ సౌండ్ స్టేజింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 70+ కనెక్టెడ్ కార్ ఫీచర్లు, వైర్లెస్ చార్జర్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఫీచర్లు ఉన్నాయి. తొలిసారి స్కార్పియో-ఎన్లో సన్రూఫ్ ఫీచర్ జత చేశారు. ఇంకా సేప్టీ కోసం 6-ఎయిర్బ్యాగ్స్, రివర్స్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, రేర్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు జత కలిశాయి.
Scorpio-N | న్యూ రికార్డు.. నిమిషంలో 25వేలు.. అర్థగంటలో లక్ష .. స్కార్పియో-ఎన్ బుకింగ్స్