Mahindra XUV700 | భారత్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మహీంద్రా ఎస్యూవీ ఎక్స్‌యూవీ 700కి మార్కెట్లో ప్రస్తుతం భారీగానే డిమాండ్ ఉన్నది. మైలేజీ, సూపర్ లుకింగ్, బెస్ట్ సేఫ్టీ ఫీచర్ల నేపథ్యంలో ఎక్స్‌యూవీని కొనుగోలు చేసేందుకు వాహనదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం రోడ్లపై ఎక్కువగానే కార్లు కనిపిస్తున్నాయి. మార్కెట్లోకి వచ్చిన తక్కువ సమయంలోనే రెండులక్షలకుపైగా యూనిట్స్ అమ్మకాలు జరిగాయి. ఈ కారు మార్కెట్లోకి వచ్చి దాదాపు మూడేళ్లు దాటింది. ఈ క్రమంలోనే మహీంద్రా కొత్త ఎబోనీ ఎడిషన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. టాటా సఫారీ, టాటా హారియర్, ఇతర డార్క్ ఎడిషన్ ఎస్‌యూవీల తరహాలోనే మహీంద్రా సైతం బ్లాక్ థీమ్‌లో ఎస్‌యూవీని తీసుకువచ్చింది. సోమవారం ఈ ఎస్‌యూవీని లాంచ్ చేసింది.
స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే.. కేవలం కాస్మెటిక్ మార్పులతో తీసుకు వస్తున్నది. ఎబోనీ ఎడిషన్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ క్యాబిన్లో కాస్మొటిక్ అప్డేట్స్తో తెస్తున్నది. పలు కీలకమైన డిజైన్ అంశాంల్లో బ్రష్డ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, బ్లాక్ ఆన్ బ్లాక్ గ్రిల్ ఇన్సర్ట్స్, బ్లాక్డ్ అవుట్ ఓఆర్వీఎం ఉన్నాయి. క్యాబిన్లో కన్సోల్, డోర్ ప్యానెల్స్ వెంట బ్లాక్ లెథరెట్ అప్హోల్స్టరీ, బ్లాక్ ట్రిమ్స్, సిల్వర్ యాక్సెంట్స్ ఉన్నాయి. డ్యూయల్ టోన్ థీమ్ కోసం లైట్ గ్రే కలర్ రూఫ్ లైనర్ను జోడించింది. ఎక్స్‌యూవీ700 ఎబోనీ ఎడిషన్ క్యాబిన్ లోపల ఉన్న కొన్ని ఇతర డిజైన్ అంశాల్లో డార్క్ క్రోమ్ ఏసీవెంట్స్ ఉన్నాయి. కారు బేసిక్ వెర్షన్‌లోని అన్ని ఫీచర్స్ ఉంటాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎబోనీ ఎడిషన్‌లో అతిపెద్ద మార్పు సెల్త్ బ్లాక్ కలర్ థీమ్.
ఇది కారుకు ప్రీమియం లుక్‌ను అందించనున్నది. దాంతో పాటు ఎస్యూవీ బ్రస్డ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, బ్లాక్ ఆన్ బ్లాక్ గ్రిల్ ఇన్సర్ట్లు, 18 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్‌ను ఉంటాయి. బ్లాక్, సిల్వర్ కలర్ వేరియంట్ స్టాండర్డ్ వర్షన్ నుంచి భిన్నంగా మారుస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో అనేక కాస్మెటిక్ అప్డేట్స్ చేయకపోయినా.. ఇంజిన్, పనితీరులో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఎస్యూవీ ప్రామాణిక ఎక్స్‌యూవీ700 మాదిరిగానే మెకానికల్ సెటప్‌తో వస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎబోనీ ఎడిషన్ 7-సీటర్ ఎఫ్‌డబ్ల్యూడీ వెర్షన్ AX7, AX7 L ట్రిమ్‌లపై ఆధారపడి ఉంటుంది. AX7 వేరియంట్ ధర రూ. 20 లక్షల నుంచి రూ. 22 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉండగా.. AX7 ఎల్ వేరియంట్ ధర రూ. 23 లక్షల నుంచి రూ. 24 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ధర పలుకున్నది.