న్యూఢిల్లీ, మే 22: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నయా ఎస్యూవీ మాడల్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్‌యూవీ700 పేరుతో విడుదల చేసిన ఏఎక్స్5 మాడల్ ప్రారంభ ధరను రూ.16.89 లక్షలుగా నిర్ణయించింది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగిన వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో తీర్చిదిద్దింది. పుష్ స్టార్ట్/టాప్ బటన్, అడ్రెనోక్స్ కనెక్టెడ్ ఫీచర్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్ఎస్, ఆరు స్పీకర్లతో సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది. పెట్రోల్ ఇంజిన్ కలిగిన మాడల్ రూ.16.89 లక్షల నుంచి రూ.18.49 లక్షల లోపు, డీజిల్ మాడల్ రూ.17.49 లక్షల నుంచి రూ.19.09 లక్షలకు విక్రయించనున్నది.