Mahindra XUV300 | దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. తన ఎస్యూవీ ఎక్స్‌యూవీ300 మోడల్ కార్లలో రెండు కొత్త వేరియంట్లు మార్కెట్లోకి తెచ్చింది. న్యూ ఎంట్రీ లెవల్ డబ్ల్యూ2తోపాటు టర్బో స్పోర్ట్ వర్షన్ ‘డబ్ల్యూ4’ ఆవిష్కరించింది. డబ్ల్యూ4 వేరియంట్ నుంచి టాప్ హై ఎండ్ వరకు లభించే వేరియంట్ పెట్రోల్ లేదా డీజిల్ వర్షన్ కార్లకు సన్ రూఫ్ లభిస్తుంది. డబ్ల్యూ2 వేరియంట్ ఎక్స్‌యూవీ300 కార్లలో అతి చౌకగా రూ.7.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఇక టర్బో స్పోర్ట్ వర్షన్ ‘డబ్ల్యూ4’ రూ.9.29 లక్షలు పలుకుతుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కార్ల ధరలు రూ.7.99 లక్షల నుంచి రూ.14.59 లక్షల మధ్య పలుకుతాయి. మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుండాయ్ వెన్యూ, కియా సొనెట్ మోడల్ కార్లతో మహీంద్రా ఎక్స్‌యూవీ300 కారు తలపడుతుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఐదు వేరియంట్లు- డబ్ల్యూ2, డబ్ల్యూ4, డబ్ల్యూ6, డబ్ల్యూ8, డబ్ల్యూ 8(0) లలో లభిస్తుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 సబ్-4 మీటర్ కంపాక్ట్ ఎస్యూవీ కారు మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.2 లీటర్ల టర్బో చార్జ్డ్ మల్టీ పాయింట్ ఫ్యుయల్ ఇంజెక్షన్ (టీసీఎంపీఎఫ్ఐ) పెట్రోల్, 1.2-లీటర్లు ఎం-స్టాలియన్ టర్బో చార్జిడ్ ఇంటర్ కూల్డ్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్ట్ (టీజీడీఐ) పెట్రోల్ అండ్ 1.5 లీటర్ల డీజిల్, టీసీఎంపీఎఫ్ఐ ఇంజిన్ 110 పీఎస్ విద్యుత్, 200 ఎన్ఎం టార్చి, టీజీడీఐ ఇంజిన్ (టర్బో స్పోర్ట్ వర్షన్) గరిష్టంగా 130 పీఎస్ విద్యుత్, 230 ఎన్ఎం టార్చి, డీజిల్ ఇంజిన్ 117 పీఎస్ విద్యుత్, 300 ఎన్ఎం టార్చి వెలువరిస్తాయి. టీసీఎంపీఎఫ్ఐ, డీజిల్ ఇంజిన్ వేరియంట్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, టీజీడీఐ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో పని చేస్తుంది.
డబ్ల్యూ2 మాన్యువల్ ట్రాన్స్ మిషన్ – రూ.7.99 లక్షలు
డబ్ల్యూ4 మాన్యువల్ ట్రాన్స్ మిషన్ – రూ. 8.65 లక్షలు
డబ్ల్యూ6 మాన్యువల్ ట్రాన్స్ మిషన్ – రూ. 9.99 లక్షలు
డబ్ల్యూ6 ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ – రూ.10.69 లక్షలు
డబ్ల్యూ8 మాన్యువల్ ట్రాన్స్ మిషన్ – రూ. 11.49 లక్షలు
డబ్ల్యూ8 (0) మాన్యువల్ ట్రాన్స్ మిషన్ – రూ.12.59 లక్షలు
డబ్ల్యూ8 (0) ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ – రూ. 13.29 లక్షలు
డబ్ల్యూ4 మాన్యువల్ ట్రాన్స్ మిషన్ – రూ.9.29 లక్షలు
డబ్ల్యూ6 మాన్యువల్ ట్రాన్స్ మిషన్ – రూ.10.49 లక్షలు
డబ్ల్యూ8 మాన్యువల్ ట్రాన్స్ మిషన్ – రూ.11.99 లక్షలు
డబ్ల్యూ8 (0) ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ – రూ. 12.99 లక్షలు
డబ్ల్యూ4 మాన్యువల్ ట్రాన్స్ మిషన్ – రూ.10.20 లక్షలు
డబ్ల్యూ6 మాన్యువల్ ట్రాన్స్ మిషన్ – రూ. 10.99 లక్షలు
డబ్ల్యూ6 ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ – రూ. 12.29 లక్షలు
డబ్ల్యూ8 మాన్యువల్ ట్రాన్స్ మిషన్ – రూ. 12.99 లక్షలు
డబ్ల్యూ8 (0) మాన్యువల్ ట్రాన్స్ మిషన్ – రూ. 13.91 లక్షలు
డబ్ల్యూ8 (0) ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ – రూ. 14.59 లక్షలు