Mahindra XUV 400 pro EV | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) దేశీయ మార్కెట్లోకి రెండు ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించింది. మహీంద్రా ఎక్స్ యూవీ400 ఎలక్ట్రిక్ కార్లు ఈసీ ప్రో (EC Pro), ఈఎల్ ప్రో (EL Pro) పేరుతో ఆవిష్కరించింది. ఈసీ ప్రో (EC Pro) ధర రూ.15.49 లక్షలు కాగా, ఎల్ ప్రో (EL Pro) ధర రూ.15.49 లక్షలు పలుకుతున్నది. ఈఎల్ ప్రో (EL Pro) మోడల్ 34.5కిలోవాట్ల బ్యాటరీ ఆప్షన్ రూ.16.47 లక్షలు, 39.4 కిలోవాట్ల బ్యాటరీ ఆప్షన్ రూ.17.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా ఖరారు చేసింది. న్యూ అప్ హోల్స్టరీతోపాటు రీ డిజైన్డ్ డాష్ బోర్డ్, కొత్త ఫీచర్లతో మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ వేరియంట్ కార్లను తీర్చిదిద్దింది.
మహీంద్రా ఎక్స్ యూవీ400 ప్రో కారు.. సాటిన్ కాపర్ అసెంట్స్, గ్రే అండ్ బ్లాక్ అప్ హోల్స్టరీతోపాటు రీ డిజైన్డ్ సెంటర్ కన్సోల్ తో వస్తున్నది. పియానో బ్లాక్ ఫినిష్, ఫ్లాట్ బాటం స్టీరింగ్ వీల్, 10.25 అంగుళాల డిస్ ప్లే ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే లేదా ఆండ్రాయిడ్ ఆటో, అడ్రెనో ఎక్స్- కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అలెక్సా ఇంటిగ్రేషన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. నేవిగేషన్, ఈవీ -స్పెషిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం అదనంగా ఫుల్లీ డిజిటల్ 10.25 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి.
మహీంద్రా ఎక్స్ యూవీ 400 ప్రో కారు అడ్రెనోఎక్స్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ చార్జింగ్, రేర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, సింగిల్ పేన్ సన్ రూఫ్, టీపీఎంఎస్, రేర్ కెమెరా, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎంస్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఆల్ ఫోర్ డిస్క్ బ్రేక్స్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ మౌంట్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఈఎస్పీ తదితర ఫీచర్లు జత చేశారు. ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఎలక్ట్రిక్ వేరియంట్లు ఈసీ ప్రో, ఈఎల్ ప్రో కార్లు ఎల్-మోడ్ ఫర్ సింగిల్ పెడల్ డ్రైవ్ టెక్నాలజీతోపాటు ఫన్, ఫాస్ట్, ఫ్యూరియస్ మోడ్ల్లో లభిస్తాయి.