Mahindra Thar Roxx | మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన ఆఫ్ రోడ్ ఎస్యూవీ 5-డోర్ థార్ రాక్స్ కోరులో కొత్త ఫీచర్ జత చేసింది. 4×4 వేరియంట్లకు డార్కర్ మోకా ఇంటీరియర్ ఆప్షన్ జత చేశారు. ఎంఎక్స్ 5 ట్రిమ్ వేరియంట్ లోనూ ఈ ఆప్షన్ లభిస్తుంది. అయితే బుకింగ్ సమయంలోనే కస్టమర్లు రెండు ఇంటీరియర్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే, మోకా ఇంటీరియర్ ఆప్షన్ ఎంచుకున్న కస్టమర్లు అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. మోకా బ్రౌన్ ఇంటీరియర్స్ తో కూడిన థార్ రాక్స్ కార్ల డెలివరీ వచ్చే ఏడాది జనవరి నుంచి, ఐవరీ ఇంటీరియర్లతో కూడిన థార్ రాక్స్ కారు డెలివరీ విజయదశమి పర్వదినం నుంచి ప్రారంభం అవుతుంది.
మహీంద్రా థార్ రాక్స్ కారు ధర రూ.12.99 లక్షల నుంచి రూ.22.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. మారుతి సుజుకి జిమ్నీతోపాటు ఫోర్స్ గుర్ఖా 5-డోర్ కార్లకు మహీంద్రా అండ్ మహీంద్రా థార్ రాక్స్ గట్టి పోటీ ఇవ్వనున్నది. తొలుత మహీంద్రా అండ్ మహీంద్రా తన థార్ రాక్స్ కారును లైటర్ ఐవరీ కలర్ ఆప్షన్ లో ఆవిష్కరించింది.