న్యూఢిల్లీ, జూలై 8: మహీంద్రా అండ్ మహీంద్రా..ఎస్యూవీ, కమర్షియల్ వాహన ధరలను 2.7 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు అధికం కావడంతో ఎస్‌యూవీలను 2.7 శాతం, కమర్షియల్ వాహనాలను 2 శాతం వరకు సవరించినట్టు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. పెరుగనున్న ధరలు ఈ నెల 10 నుంచి అమల్లోకి రానున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం మహీంద్రా..అత్యంత ప్రజాదరణ పొందిన స్కార్పియో, థార్, ఎక్స్‌యూవీ 3ఎక్స్వో, ఎక్స్‌యూవీ 7ఎక్స్వోతోపాటు పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. వీటి ధరలు రూ.7.54 లక్షల మొదలుకొని రూ.25.07 లక్షల గరిష్ఠ స్థాయిలో అందిస్తున్నది.