Mahindra Scorpio-N | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి న్యూ మోడల్ స్కార్పియో-ఎన్ను ఆవిష్కరించింది. ఈ ఎస్యూవీ మోడల్ కారుకు తొలిసారి సన్‌రూఫ్ కల్పించారు. న్యూ స్కార్పియో-ఎన్.. హ్యుండాయ్ క్రెడా వంటి కార్లతో పోటీ పడనున్నది. న్యూ స్కార్పియో కార్ల బుకింగ్స్ వచ్చేనెల 30 నుంచి మొదలవుతాయి. తొలుత బుకింగ్ చేసుకున్నవారికి దీన్ని డెలివరీ చేస్తారు. ఈ ఎస్యూవీ స్కార్పియో-ఎన్ను వచ్చే పండుగ సీజన్లో కస్టమర్లకు అందిస్తారని సమాచారం. అయితే, వచ్చేనెల ఐదో తేదీ నుంచి టెస్ట్ డ్రైవ్ మొదలవుతుంది. ఇప్పటికైతే దీని ధరను వెల్లడించలేదు.
ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తోపాటు డబుల్ బ్యారెల్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ లాంప్ అసెంబ్లీ, టాల్ బాయ్నెట్, రీ డిజైన్డ్ గ్రిల్లె, క్రోమ్ స్లాట్స్ వంటి ఫీచర్లు కొత్తగా డిజైన్ చేశారు. ఈ ఎస్యూవీ కారు 4,662 మిల్లీ మీటర్ల పొడవు, 1917 మి.మీ. వెడల్లు, 1857 మీ.మీ ఎత్తు ఉంటుంది. దీని వీల్ బేస్ 2,780 మి.మీ. బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ థీమ్‌లో స్కార్పియో డాష్‌బోర్డు ఉంటుంది. డాష్‌బోర్డుపై `స్కార్పియో-ఎన్` బ్యాడ్జ్ ఇస్తారు.
2022 స్కార్పియో-ఎన్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కొత్తగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేస్తుంది. 3డీ సౌండ్ స్టేజింగ్‌తో సోనీ 12 స్పీకర్ ఆడియో సిస్టమ్, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 70+ కనెక్టెడ్ కార్ ఫీచర్స్, వైర్లెస్ చార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ తదితర ఫీచర్లు జత కలిశాయి. స్కార్పియో క్లాసిక్‌తో పోలిస్తే మహీంద్రా స్కార్పియో-ఎన్లో 360-డిగ్రీల కెమెరా, హిల్ డిస్కెంట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, 6 ఎయిర్ బ్యాగ్స్‌తోపాటు పలు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
హ్యుండాయ్ క్రెటా, హ్యుండాయ్ అల్కాజర్ కార్లతో న్యూ మహీంద్రా స్కార్పియో-ఎన్ పోటీ పడనున్నది. ఇది టాటా హరియర్, టాటా సఫారీలకు సవాల్ విసురుతుందని చెబుతున్నారు. తక్కువ ధరలో టయోటా ఫార్చ్యూనర్ కారును స్కార్పియో-ఎన్ పోలి ఉంటుందని తెలుస్తున్నది. అంతే కాదు.. లగ్జరీ కార్లలో లభించే ఫీచర్లు ఇందులో లభిస్తాయంటున్నారు.
ఎంట్రీ లెవల్ కారు ధర రూ.11.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, 4×4 వేరియంట్ల కార్ల ధరలు వచ్చేనెల 21న ప్రకటిస్తారు. టాప్ వేరియంట్ ధర రూ.19.49 లక్షలు పలుకుతుందని సమాచారం. ఈ ఇంట్రడ్యూసరీ ధరలు తొలి 25 వేల కార్లకు మాత్రమే వర్తిస్తాయి.