బీఆర్ఎస్ స్థానాల్లోనే ఓట్ల తొలగింపు.. తెలంగాణలో సర్ ప్రక్రియపై అనుమానాలు
తెలంగాణలో సర్ ప్రక్రియ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న స్థానాల్లోనే అత్యధిక ఓట్లను తొలగించారని పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆరోపించారు.
- సీఈసీని ప్రధాని రాజీనామా చేయించాలి
- ఈసీఐపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి
- నియామక కమిటీలోకి సీజేఐని తీసుకోవాలి
- బీఆర్ఎస్ మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తేతెలంగాణ): తెలంగాణలో సర్ ప్రక్రియ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న స్థానాల్లోనే అత్యధిక ఓట్లను తొలగించారని పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో సర్ ప్రక్రియపై అనేక అనుమానాలు ఉన్నాయని, బీఎల్వోలు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వం, సీఈవో పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్, లీగల్‌సెల్ బాధ్యురాలు లలితారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సర్ పేరిట అన్యాయంగా ఓట్లు తొలగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ (చీఫ్ ఎలక్షన్ కమిషనర్)ని రాజీనామా చేయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘంపై విశ్వాసాన్ని పునరుద్ధరించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉన్నదని స్పష్టంచేశారు. ఇద్దరు సహా కమిషనర్లు వ్యతిరేకించినా సీఈసీ వివాదాస్పద నిర్ణయాలు తీసుకొన్నారని ఆరోపణలు రావడంతో ఎలక్షన్ కమిషన్ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని అభిప్రాయపడ్డారు. ఓటుహక్కు కలిగిన సామాన్యులకు ఎలక్షన్ కమిషన్‌పై అనుమానాలు వచ్చాయంటే ప్రజాస్వామ్యం నిలబడే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఈసీ వివాదాస్పద నిర్ణయాల ప్రభావం ఇటీవల ఎన్నికలు జరిగిన పశ్చిమ బంగా, బిహార్‌లో స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తమ వ్యతిరేక ఓట్లను తొలగించిందనే విషయం అర్థమవుతుందని చెప్పారు.
మోదీ సర్కార్ నిర్వాకంతోనే ఈ దుస్థితి
మోదీ సర్కార్ నిర్వాకంతోనే స్వతంత్ర, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ అప్రతిష్ఠ పాలయ్యే దుస్థితి వచ్చిందని వినోద్‌కుమార్ ఆరోపించారు. ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తో కూడిన కమిటీ సీఈసీని నియమించే విధానాన్ని మోదీ ప్రభుత్వం తొలగించి, చీఫ్ జస్టిస్ స్థానంలో కేంద్ర క్యాబినెట్ మంత్రిని నియమించిందని ఆరోపించారు. కేంద్రం వెంటనే కండ్లు తెరిచి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఎలక్షన్ కమిషనర్ నియామక కమిటీ నుంచి కేంద్ర మంత్రిని తొలగించి తిరిగి చీఫ్ జస్టిస్‌కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మోదీ సైతం నాటి ప్రధాని ఇందిరాగాంధీ వలే నియంతృత్వ పోకడలకు పోతున్నారని విమర్శించారు. సీఈసీ తక్షణమే స్వచ్ఛందంగా వైదొలగాలని, లేదంటే సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి రాష్ట్రపతికి నివేదించాలని కోరారు. సీఈసీని తొలగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్టు స్పష్టంచేశారు.
ఫిరాయింపుల చట్టానికి రాహుల్ తూట్లు
తన తండ్రి రాజీవ్‌గాంధీ తెచ్చిన ఫిరాయింపుల చట్టానికి ఆయన తనయుడైన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తూట్లు పొడిచారని వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగడం తప్ప ఉద్ధరించిందేమీలేదని మండిపడ్డారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫిరాయింపుల చట్టాన్ని అపహాస్యం చేస్తుంటే ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్రు కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయించడం ఎనిమిదో వింత అని, ఇలాంటి వింతలు రాహుల్‌తోనే సాధ్యమని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

