హైదరాబాద్, జూన్ 18: మహీంద్రా అండ్ మహీంద్రా.. వ్యవసాయ ఉత్పత్తుల విభాగాన్ని మరింత బలోపేతం చేసేదిశగా తెలుగు రాష్ర్టాల్లో ఆరు వరుసల వరి నాటే 6ఆర్వో యంత్రాన్ని ఆవిష్కరించింది. వరిసాగు సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు అత్యంత శక్తివంతమైన, సమర్థవంతమైన ఇంజిన్, అధునాతన టెక్నాలజీతో దీనిని రూపొందించింది. మహీంద్రా ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్తోపాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి 75 శాతం వరకు ఫైనాన్స్ లభించనున్నది.