ముంబై, జనవరి 24: మహీంద్రా నయా ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ లిమిటెడ్ ఎడిషన్ ట్రాక్టర్లు మూడు సరికొత్త రంగుల్లో లభించనున్నాయి. యూవో టెక్+ 585 డీఐ 4డబ్ల్యూడీని లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ ట్రాక్టర్ 45.4 హెచ్‌పీ శక్తినివ్వనున్నది. నాలుగు సిలిండర్ల ఇంజిన్, 2 వేల కిలోల హైడ్రాలిక్ లిఫ్ట్ కెపాసిటీ, డ్యూయల్ క్లచ్, 12 ఫార్వర్డ్ గేర్లు, మూడు రీవర్స్ గేర్లు, పవర్ స్టీరింగ్‌తో తీర్చిదిద్దింది.
ఈ సందర్భంగా కంపెనీ నేషనల్ బిజినెస్ హెడ్ పరీక్షిత్ ఘోష్ మాట్లాడుతూ.. నయా టెక్నాలజీ ట్రాక్టర్లను తరువాతి తరాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ లిమిటెడ్ ఎడిషన్‌గా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. 26 నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన షోరూంలలో మాత్రమే ఈ ట్రాక్టర్లు లభించనున్నాయి.