ముంబై, నవంబర్ 7: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,171 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,348 కోట్ల కంటే ఇది 35 శాతం అధికమని పేర్కొంది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.34,436 కోట్ల నుంచి రూ.37, 924 కోట్లకు పెరిగింది.