హైదరాబాద్, ఫిబ్రవరి 12 : దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహన తయారీ సంస్థ మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్..తాజాగా దేశీయ మార్కెట్కు ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోను పరిచయం చేసింది. ‘ఉడో’ పేరుతో విడుదల చేసిన ఈ ఆటోను ప్రారం భ ధర రూ.3,58, 999గా నిర్ణయించింది. స్వల్పకాలం మాత్రమే ఈ ధరలు అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత ఈ ధరను రూ.3,84,299కి పెంచుతామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్కు సమీపంలోని జహీరాబాద్లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో ఈ ఎలక్ట్రిక్ ఆటోను తయారు చేసినట్టు మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ సీఈవో, ఎండీ సుమన్ మిశ్రా తెలిపారు. ఈ ఆటోను ఉత్పత్తి చేయడానికి రూ.500 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్టు, ఏడాదికి రెండు లక్షల యూనిట్ల సామర్థ్యం కలిగిన ప్రత్యేక లైన్ను నెలకొల్పినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే ముందస్తు బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ఈ వారాంతం డెలివరీ చేయనున్నట్టు ఆమె ప్రకటించారు.