న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: మహీంద్రా అండ్ మహీంద్రా పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. జీఎస్టీ ప్రయోజనంతోపాటు పండుగ రాయితీని కలుపుకొని ఎంపిక చేసిన మాడళ్లను రూ.2.5 లక్షల తగ్గింపుతో విక్రయిస్తున్నది. వీటిలో 3ఎక్స్వో ధర రూ.2.56 లక్షల వరకు తగ్గించిన సంస్థ.. థార్ మాడల్ ధరను రూ.1.5 లక్షలు కోత పెట్టిం ది.
ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకా రం చుట్టిన సంస్థ.. రాయితీలను తెరపైకి తీసుకొచ్చింది. థార్ రూ.12.25 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుండగా, ఎక్స్‌యూవీ700 రూ.13.66 లక్షల ధరతో లభిస్తున్నది. అలాగే రాక్స్ మాడల్‌పై రూ.1.33 లక్షల రాయితీ ఇస్తున్నది.