Mahindra Scorpio- N | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా.. కార్లు మొదలు వాణిజ్య వాహనాలు తయారు చేస్తోంది. కార్లలో ప్రస్తుతం ఎస్యూవీ మోడల్ కార్లపైనే అందరి మోజు. ఈ నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ ఎస్యూవీ కారు ‘స్కార్పియో-ఎన్’ లో కొత్త ఫీచర్లు జత చేసింది. అందునా స్కార్పియో -ఎన్’లో జడ్8 రేంజ్ మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్ కారులో ఈ ఫీచర్లు జోడించింది. స్కార్పియో ఎన్ జడ్8 ఎస్, స్కార్పియో ఎన్ జడ్8 ఎల్ వేరియంట్లలో కొత్త ఫీచర్లు ఉంటాయి.
మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో ఎన్ జడ్ 8 ఎస్, స్కార్పియో ఎన్ జడ్8 మోడల్ కార్లలో వైర్ లెస్ చార్జర్, హై గ్లాస్ సెంటర్ కన్సోల్ ఫీచర్లు కొత్తగా చేర్చారు. ఇక స్కార్పియో ఎన్ జడ్8 ఎల్ కారులోనూ వెంటిలేటెడ్ సీట్స్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, వైర్ లెస్ చార్జర్ (విత్ యాక్టివ్ కూలింగ్), హై గ్లాస్ సెంటర్ కన్సోల్ ఉంటాయి.
స్కార్పియో ఎన్’లో మహీంద్రా న్యూ థర్డ్ జనరేషన్ బాడీ ఆన్ ఫ్రేమ్ ప్లాట్ ఫామ్ వినియోగించారు. ఈ కారు 2.0 లీటర్ల ఎంస్టాలియన్ టీజీడీఐ పెట్రోల్ (200 పీఎస్ విద్యుత్, 380 ఎన్ఎం టార్క్), 2.2 లీటర్ల ఎంహాక్ సీఆర్డీఐ డీజిల్ (175 పీఎస్ విద్యుత్, 400 ఎన్ఎం టార్క్) ఇంజిన్లు ఉంటాయి. రెండు ఇంజిన్ వేరియంట్లలోనూ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉంటాయి. ఈ కార్లలో 4డబ్ల్యూడీ ఆప్షన్ కూడా ఉంటుంది. మహీంద్రా స్కార్పియో ఎన్ కారు ధర రూ.13.85 లక్షల నుంచి రూ.24.54 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. హ్యుండాయ్ అల్కజార్, ఎంజీ హెక్టార్ ప్లస్ తదితర కార్లకు మహీంద్రా స్కార్పియో ఎన్ గట్టి పోటీ ఇస్తోంది.
Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
Ayushman Bharat | రూ. 10 లక్షల వరకూ ఆయుష్మాన్ భారత్ లిమిట్..?!
Ola Cabs – Ola Maps | గూగుల్ మ్యాప్స్‌కు బైబై.. ఇక ఓలా మ్యాప్స్ పైనే క్యాబ్ రైడింగ్.. ఎందుకంటే..?!
iPhone 14 Plus | ఐ-ఫోన్ 14 ప్లస్ కావాలా.. రూ.23 వేల వరకూ ఆదా చేయొచ్చు..!
Reliance Jio | వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ..?!