Mahesh Babu | హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఆరోగ్యకరమైన చిరుతిండి పదార్థాల తయారీ సంస్థ ఫిట్డేలో తెలుగు సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పెట్టుబడులు పెట్టింది. ఆర్థిక వివరాలు మాత్రం వెల్లడించలేదు. వ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగంగా ఫిట్డై మరో మైలురాయికి చేరుకోనున్నదని, తాజాగా మహేశ్ బాబు పెట్టుబడులు పెట్టడం ఆయనకు ధన్యవాదములని కంపెనీ ఫౌండర్, సీఈవో సురేశ్ రాజు తెలిపారు.
ఇప్పటికే చాలా పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని, కానీ సరైన అవకాశాలు, తమ విజన్‌కు తగ్గట్టుగా ఉన్నవారి నుంచి మాత్రమే పెట్టుబడులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కంపెనీ తన వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నదని, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్లు, కార్పొరేట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.