హైదరాబాద్, జూన్ 13: ప్రముఖ దుస్తుల సంస్థ డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తాజాగా తెలుగు నటుడు మహేశ్ బాబును ప్రచారకర్తగా నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ వినోద్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ర్టాల్లో విక్రయాలు 50 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఇందుకోసం 50 ఔట్లెట్లను ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.