హైదరాబాద్, అక్టోబర్ 8: అమెరికాకు చెందిన బేకరీ ఉత్పత్తుల విక్రయ సంస్థ మంగోలియా..తాజాగా హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టోర్‌ను వచ్చే శుక్రవారం ప్రారంభించబోతున్నది. ఇప్పటికే బెంగళూరులో మూడు స్టోర్లను నిర్వహిస్తున్న సంస్థకు ఇది నాలుగో స్టోర్ కావడం విశేషం. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి జోను రెడ్డి మాట్లాడుతూ.. 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో అమెరికాకు చెందిన అన్ని రకాల బేకరీ ఉత్పత్తులను కస్టమర్లకు అందిస్తున్నట్లు చెప్పారు. వ్యాపార విస్తరణలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని స్టోర్లను ఇక్కడే ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు.