Reliance | దేశీయ స్టాక్ మార్కెట్లలో గతవారం ట్రేడింగ్‌లో టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థలు రూ.1,11,012.63 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. వాటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బాగా లబ్ధి పొందాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మాత్రమే పతనం అయ్యాయి. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,635.68 కోట్లు పెంచుకుని రూ.13,82,280.01 కోట్లకు చేరుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.22,554.33 కోట్ల వృద్ధితో రూ.8,20,164.27 కోట్ల వద్ద స్థిర పడింది.
ఎఫ్ఎంసీజీ మేజర్ హిందూస్థాన్ యూనీ లివర్ మార్కెట్క్యాపిటలైజేషన్ రూ.14,391.25 కోట్లు పెరిగింది. దీంతో హెచ్‌యూఎల్ పూర్తి ఎం-క్యాప్ రూ.5,54,444.80 కోట్ల వద్ద నిలిచింది. ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ ఎం క్యాప్ రూ.10,934.61 కోట్లు పెరిగి రూ.7,94,714.60 కోట్ల వద్ద ముగిసింది.
హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.9,641.77 కోట్లు లాభ పడి రూ.4,68,480.66 కోట్ల వద్దకు చేరుకున్నది. విప్రో రూ.9,164.13 కోట్లు లబ్ధి పొంది దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,92,021.38 కోట్ల వద్ద స్థిర పడింది. ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,902.89 కోట్లు పెరిగి రూ.5,13,973.22 కోట్లకు చేరుకున్నది. బజాజ్ ఫైనాన్స్ విలువ రూ.7,575.11 కోట్లు ఎక్కువై రూ. 4,21,121.74 కోట్ల వద్ద ముగిసింది. ఇక ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.3,212.86 కోట్లు పెరిగి రూ.4,10,933.74 కోట్లకు చేరుకుంది.
స్టాక్ మార్కెట్ లీడర్‌గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,772.49 కోట్లు పతనమైంది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఎం-క్యాప్ రూ.16,01,382.07 కోట్ల వద్ద స్థిర పడింది. రిలయన్స్ తర్వాత స్థానంలో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూని లివర్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్‌ఫైనాన్స్, ఎబ్సీఐ, విప్రో నిలిచాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1.97 శాతంతో 1,129.51 పాయింట్లు లబ్ధి పొందింది.