ఎయిర్టెల్.. ఎస్బీఐ లబ్ధి.. రిలయన్స్ & ఇన్ఫీ డౌన్
ఎయిర్టెల్.. ఎస్బీఐ లబ్ధి | స్టాక్ మార్కెట్లలో గతవారం ట్రేడింగ్‌లో టీసీఎస్, ఎయిర్టెల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లబ్ధి పొందాయి.

ముంబై: గతవారం స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో నాలుగింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.65,464 కోట్లు పెరిగింది. గతవారం ట్రేడింగ్‌లో ఎయిర్టెల్, ఎస్బీఐ స్క్రిప్ట్‌లు అధిక లాభాలు గడించాయి. ఇక బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1.21 శాతం లేదా 710 పాయింట్లు పెరిగింది. గురువారం సెన్సెక్స్ 59 వేల మార్క్‌ను చేరుకున్నది. బీఎస్ఈ చరిత్రలో ఇదే ఫస్ట్‌టైం.

టాప్-10 సంస్థల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్ భారీగా లబ్ధి పొందాయి. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,984.14 కోట్లు పెరిగి రూ.3,99,901.97 కోట్లకు దూసుకెళ్లింది. మరోవైపు ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.19,500.28 కోట్లతో రూ.4,05,221.99 కోట్లకు పెరిగింది.

టీసీఎస్ ఎం-క్యాప్ రూ.14,315.33 కోట్లు పెరిగి రూ.14,16,903.13 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.8,664.66 కోట్లు ఎక్కువై రూ.8,76,597.86 కోట్లకు దూసుకెళ్లింది.

రిలయన్స్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.43,746 కోట్లు నష్టపోయాయి. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.22,219.75 కోట్లు తగ్గిపోయి రూ.15,15,380.48 కోట్ల వద్ద స్థిర పడింది.
హిందూస్థాన్ యూనీ లివర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,605.92 కోట్లు తగ్గి రూ.6,39,335.53 కోట్లతో సరి పెట్టుకున్నది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.576.19 కోట్లు పడిపోయి, రూ.5,10,550.29 కోట్లకు చేరుకున్నది.

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.212.1 కోట్లు తగ్గి రూ.7,17,427.09 కోట్లకు చేరుకున్నది. బజాజ్ ఫైనాన్స్ ఎం-క్యాప్ రూ.90.54 కోట్లు పడిపోయి రూ.4,48,292.54 కోట్లతో స్థిర పడింది. ప్రైవేట్ బ్యాంకర్ ఐసీఐసీఐ బ్యాంక్ రూ.42.29 కోట్లు తగ్గి దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,99,176.68 కోట్లతో స్థిర పడింది.

టాప్-10 కంపెనీల్లో రిలయన్స్ లీడ్‌గా వ్యవహరిస్తున్నది. తర్వాతీ స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

