న్యూఢిల్లీ, నవంబర్ 8: ఆడీ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి క్యూ5ను ప్రత్యేక ఎడిషన్‌గా విడుదల చేసింది. మూడు రకాల్లో లభించనున్న ఈ మోడల్ రూ.60.50 లక్షల ప్రారంభ ధరతో రూ.67.05 లక్షల గరిష్ఠ ధరలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. కేవలం 6.3 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గరిష్ఠంగా గంటకు 237 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.